జూలై 12న చైనాలో విడుదల అవుతున్న రజనీకాంత్ 2. ఓ


Rajanikanth' s 2.0 releasing in china

జూలై 12న చైనాలో విడుదల అవుతున్న రజనీకాంత్ 2. ఓ

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 2. ఓ చిత్రాన్ని చైనాలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . గత ఏడాది భారతదేశంలో విడుదలై విజయం సాధించిన 2. ఓ చిత్రాన్ని చైనాలో జూలై 12 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 2010 లో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది 2. ఓ . సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది 2.ఓ. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటించడం విశేషం.

తెలుగు , తమిళ భాషల్లో 2. ఓ ఓ మోస్తారు విజయం సాధించింది కానీ ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. దాంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఇండియాలో రూపొందే చిత్రాలకు చైనాలో మంచి డిమాండ్ ఉండటంతో 2. ఓ అక్కడ భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఒక్క చైనాలోనే కాకుండా రష్యాలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యాలో జూలై 25 న విడుదల కానుంది 2.ఓ .