రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు పాజిటివ్‌!

రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు పాజిటివ్‌!
రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు పాజిటివ్‌!

క‌రోనా వైర‌స్ త‌గ్గు ముఖం ప‌ట్టింద‌ని భావిస్తున్న వారికి వ‌రుస సంఘ‌ట‌న‌లు భ‌యం క‌లిగిస్తున్నాయి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ కోవిడ్‌ని తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నాయి. ఇటీవ‌ల కోవిడ్ కారణంగా గాన గంధ‌ర్వుడు ఎస్పీబాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెందిన విష‌యం తెలిసిందే. క‌రోనా బారిన ప‌డిన చాలా మంది సినీ తార‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే దుర‌దృష్టం కొద్ది కొంత మంది మృత్యువాత ప‌డుతున్నారు.

ఇదిలా వుంటే తాజాగా హీరో డా. రాజ‌శేఖ‌ర్, జీవిత క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలిసింది. వారం రోజుల క్రిత‌మే వీరికి క‌రోనా సోకిన‌ట్టు చెబుతున్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే వీరిద్ద‌రు హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయార‌ట‌. రాజ‌శేఖ‌ర్ యాక్ట‌రే కాదు డాక్ట‌ర్ కూడా. అయితే కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే ఆయ‌న ఇటీవ‌ల త‌న తాజా చిత్ర షూటింగ్‌ని ప్రారంభించాల‌నుకున్నారు. నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో ఇటీవ‌ల మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేశారు.

అయితే కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో హీరో రాజ‌శేఖ‌ర్ చికిత్స చేయించుకున్నార‌ట‌. ఆ త‌రువాత ఆయ‌న భార్య జీవితకు కూడా కోవిడ్ సోక‌డంతో ఇద్ద‌రూ డాక్ట‌ర్ల స‌ల‌హాల మేర‌కు హోమ్ క్వారెంటైన్‌కి ప‌రిమిత‌మై చికిత్స పొందుతున్న‌ట్టు తెలిసింది.