పవన్ కళ్యాణ్ పై జాలిపడిన రాజశేఖర్


పవన్ కళ్యాణ్ పై జాలిపడిన రాజశేఖర్

Rajasekhar comments on pawan kalyan

పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసాడు , కనీసం ఒక్క చోటైనా గెలిచి ఉంటే బాగుండేది అంటూ పవన్ కళ్యాణ్ పై జాలిప్రదర్శించాడు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ . వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆ సంతోషాన్ని మీడియాతో పంచుకోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు రాజశేఖర్ దంపతులు . ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ పై జాలిపడ్డాడు రాజశేఖర్ .

పవన్ కళ్యాణ్ కు రాజశేఖర్ కు అంతగా పడదు అనే విషయం అందరికీ తెలిసిందే . మెగా బ్రదర్స్ తో రాజశేఖర్ దంపతులకు విబేధాలు ఉన్నాయి . అయితే నాగబాబు తో మాత్రం మాకు ఎలాంటి విబేధాలు లేవని అంటున్నాడు రాజశేఖర్ . మా ఎన్నికల్లో నాగబాబు రాజశేఖర్ – జీవితలకు మద్దతుగా నిలిచాడు అందుకే మేము నాగబాబు కి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని అంటున్నారు . రాజకీయాల గురించి పక్కన పెడితే కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రాజశేఖర్.