న‌టుడు రాజీవ్‌క‌న‌కాల సోద‌రి హ‌ఠాన్మ‌ర‌ణం!


న‌టుడు రాజీవ్‌క‌న‌కాల సోద‌రి హ‌ఠాన్మ‌ర‌ణం!
న‌టుడు రాజీవ్‌క‌న‌కాల సోద‌రి హ‌ఠాన్మ‌ర‌ణం!

న‌టుడు రాజీవ్ క‌న‌కాల సోద‌రి, సీనియ‌ర్ నటుడు దేవ‌దాస్ క‌న‌కాల కూతురు శ్రీ‌ల‌క్ష్మి క‌న‌కాల సోమ‌వారం మృతి చెందారు. గ‌త కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీ‌ల‌క్ష్మి సోమ‌వారం క‌న్నుమూసింద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు.

ఆమె మృతి ప‌ట్ల కుటుంబ స‌భ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌ల‌క్ష్మి మృతి ప‌ట్ల సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ఇట‌వ‌ల రాజీవ్ క‌న‌కాల తండ్రి దేవ‌దాస్ క‌న‌కాల మృతి చెందిన విష‌యం తెలిసిందే. నెల‌లు తిర‌క్కుండానే ఆయ‌న కూతురు శ్రీ‌ల‌క్ష్మి కూడా మృతి చెంద‌డంతో రాజీవ్ క‌న‌కాల‌, సుమ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నార‌ట‌.

శ్రీ‌ల‌క్ష్మి భ‌ర్త పెద్ది రామారావు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు, ఆంధ్ర ప్ర‌దేశ్‌లో టీడీపీ అధికారంలో వుండ‌గా పెద్ది రామారావు ఓఎస్‌డీగా ప‌నిచేశారు. ప్ర‌ముఖ న‌టుడు, న‌ట శిక్ష‌కుడు దేవ‌దాస్ క‌న‌కాల కూతురైన శ్రీ‌ల‌క్ష్మి బుల్లితెర‌పై ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి మెప్పించారు. ఆమెకు భ‌ర్త‌, ఇద్ద‌రు అమ్మాయిలు వున్నారు.