మహేష్ తో నాది టామ్ అండ్ జెర్రీ టైప్ రోల్ : రాజేంద్ర ప్రసాద్

మహేష్ తో నాది టామ్ అండ్ జెర్రీ టైప్ రోల్ : రాజేంద్ర ప్రసాద్
మహేష్ తో నాది టామ్ అండ్ జెర్రీ టైప్ రోల్ : రాజేంద్ర ప్రసాద్

టాలీవుడ్ లో ఉన్న అత్యంత టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించగల రాజేంద్ర ప్రసాద్, ఎమోషనల్ గా చేసి ఏడిపించనూగలరు. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో ప్రేక్షకుడిని కట్టిపడేయగల నేర్పు ఉంది కాబట్టే ఇప్పటికీ రాజేంద్ర ప్రసాద్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర గురించి లీక్స్ కూడా ఇవ్వడం విశేషం. ఆ రెండు సినిమాలు మరేంటో కాదు, సంక్రాంతికి ఒకేరోజు విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో. ఈ రెండు చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ కు మంచి పాత్రలు పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల దర్శకులు అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్.. రాజేంద్ర ప్రసాద్ నటనకు పెద్ద ఫ్యాన్స్ కావడంతో తమ సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ కు మంచి రోల్స్ ఇస్తుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తదితర చిత్రాల్లో రాజేంద్రుడితో పనిచేస్తే అనిల్ రావిపూడి సుప్రీమ్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్ సినిమాల్లో హిలేరియస్ పాత్రలు ఇచ్చాడు. అయితే ఈ రెండు చిత్రాల్లో తన పాత్రల గురించి మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తనది చాలా మంచి పాత్ర అని, మహేష్ తో కాంబినేషన్స్ సీన్లు భలేగా వర్కౌట్ అయ్యాయని తెలిపాడు. శ్రీమంతుడు సినిమాలో ఇద్దరూ కలిసి నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేష్ పాత్ర, నా పాత్ర టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉంటుందని, ప్రేక్షకులు ఫుల్లుగా ఎంటర్టైన్ అవుతారని తెలిపాడు. ఇక అల వైకుంఠపురములో కూడా పోలీస్ పాత్రలో కనిపిస్తానని, జులాయి తరహాలో నా పాత్ర ఉంటుందని చెప్పి అంచనాలను పెంచేసాడు. అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాల్లో తన పాత్రలు ఎంటర్టైనింగ్ వే లో ఉంటాయని సెలవిచ్చాడు. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కామెడీకి అధికమైన ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం తెల్సిందే. సో ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు డబల్ ట్రీట్ ఉండబోతోందన్నమాట.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇక అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా టబు, నివేద పేతురాజ్, సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు జనవరి 12న విడుదల కానున్నాయి.