పృథ్వీ పై సెటైర్ వేసిన రాజేంద్రప్రసాద్


Rajendra Prasad and Pridhvi
Rajendra Prasad and Pridhvi

హాస్య నటుడు రాజేంద్రప్రసాద్ 30 ఇయర్స్ పృథ్వీ పై సెటైర్ వేసాడు . ఇటీవలే తిరుమల వెళ్లిన రాజేంద్రప్రసాద్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ సినిమావాళ్ళకు ప్రత్యేకంగా వేరే వ్యాపారాలు అంటూ ఏమి లేవు సినిమా నిర్మాణం తప్ప అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని అదేపనిగా కలవడం లేదు అంటూ నేరుగా పృథ్వీ కామెంట్స్ పై చురకలు అంటించాడు .

కమెడియన్ పృథ్వీ సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను అలాగే సినిమావాళ్లని అదేపనిగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే . చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే సినిమావాళ్లు పెద్ద క్యూ కట్టేవాళ్ళు కానీ జగన్ ముఖ్యమంత్రి కావడంతో అసలు ఇంతవరకు జగన్ ని కలవలేదని అదేపనిగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే . దాంతో రాజేంద్రప్రసాద్ స్పందించి సినిమావాళ్లు కలవడానికి ట్రై చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి చాలా బిజీ గా ఉన్నారని , అయినా అస్తమానం సినిమావాళ్లు కలవడానికి మేమేమైనా వ్యాపారస్థులమా ? అని బదులిచ్చాడు .