శ్రీ‌రెడ్డితో న‌ట‌కిరీటి క్లైమాక్స్‌!


శ్రీ‌రెడ్డితో న‌ట‌కిరీటి క్లైమాక్స్‌!
శ్రీ‌రెడ్డితో న‌ట‌కిరీటి క్లైమాక్స్‌!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన శ్రీ‌రెడ్డి తొలి సారి న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో క‌లిసి న‌టిస్తున్న చిత్రం `క్లైమాక్స్‌`. ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డుల్ని సొంతం చేసుకున్న `డ్రీమ్‌` చిత్ర ద‌ర్శ‌కుడు భ‌వాని శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని పి. రాజేశ్వ‌ర్‌రెడ్డి, కె. క‌రుణాక‌ర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ని న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయ‌న ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌గా విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. కీల‌క పాత్ర‌ల్లో పృథ్వీరాజ్‌, శి‌వ‌శంక‌ర్ మాస్ట‌ర్, శ్రీ‌రెడ్డి, సాషాసింగ్‌, ర‌మేష్‌, చందు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డ్రీమ్ మూవీ త‌రువాత భ‌వాని శంక‌ర్‌తో క‌లిసి చేస్తున్న సినిమా ఇద‌ని, ఈ ద‌ఫా మ‌ల్టీ జోన‌ర్‌లో ట్రై చేస్తున్నామ‌ని, అదేంటో తెలియాలంటే క్లైమాక్స్ చూడాల్సిందేన‌ని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

తొలిసారి మ‌ల్టీజోన‌ర్‌లో చేస్తున్న పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ థ్రిల్ల‌ర్ సిని‌మా ఇదని, రాజేంద్ర ప్ర‌సాద్ స‌హా మిగ‌తా పాత్ర‌లు థ్రిల్లింగ్‌గా వుంటాయ‌ని త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డిస్తామ‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు.