ర‌జ‌నీ డిస్క‌వ‌రీ ఎపిసోడ్ వ‌చ్చేస్తోంది!


ర‌జ‌నీ డిస్క‌వ‌రీ ఎపిసోడ్ వ‌చ్చేస్తోంది!
ర‌జ‌నీ డిస్క‌వ‌రీ ఎపిసోడ్ వ‌చ్చేస్తోంది!

త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ తో క‌లిసి డిస్క‌వ‌రీ ఛాన‌ల్ కోసం బేర్ గ్రిల్స్ మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ పేరుతో ఓ డాక్యుమెంట‌రీని షూట్ చేసిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రిలో ర‌జ‌నీకాంత్ చిత్రీకరించిన‌ ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా? అని ర‌జ‌నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వ‌చ్చింది. ర‌జ‌నీ న‌టించిన ఎపిసోడ్‌ని టెలికాస్ట్ చేయ‌బోతున్న తేదీని డిస్క‌వ‌రీ ఛాన‌ల్ ప్ర‌క‌టించింది. మార్చి 23న రాత్రి 8 గంట‌ల‌కు దీన్ని ప్ర‌సారం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.

అంతే కాకుండా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ ప్రోమోని కూడా అధికారిక ట్విట్ట‌ర్ పేజీ ద్వారా అభిమ‌నుల‌కు షేర్ చేయ‌డంతో ర‌జ‌నీ అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయింది. అల్టిమేట్  సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, సాహ‌స వీరుడు బేర్ గ్రిల్స్ క‌లిసి ఇండియా అడ‌వుల్లో చేసిన సాహ‌స విన్యాసాల‌ను చూసేందుకు సిద్ధంకండి త‌లైవా ఆన్ డిస్క‌వ‌రి` అంటూ పోస్ట్ చేసింది.

జ‌న‌వ‌రిలో ర‌జ‌నీకాంత్ పాల్గొన‌గా క‌ర్ణాట‌క‌లోని బందీపూర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే. ర‌జ‌నీ తొలి సారి న‌టించిన టీవి షో కావ‌డంతో దీనిపై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇందులో పాల్గొన‌డం మ‌రిచిపోలేని అనుభ‌వ‌మ‌ని ర‌జ‌నీ పేర్కొన్నారు. తొలి రోజు ర‌జ‌నీ ప్ర‌మాదానికి గురికావ‌డంతో షూటింగ్ జ‌ర‌గ‌లేద‌ని అంతా భావించారు కానీ ఆ మ‌రునాడే దీన్ని షూట్ చేశార‌ట‌.