2. ఓ చిత్రం లీక్ అయ్యింది


Rajinikanth 2. 0 full movie leaked online

పూర్తి హెడ్ డి ప్రింట్ ని తమిళ రాకర్స్ పెట్టేసారు దాంతో 2. ఓ చిత్ర బృందం షాక్ కి గురయ్యింది . భారీ సినిమాలు తమిళ్ లో విడుదల అవడమే ఆలస్యం తమిళ రాకర్స్ హెచ్ డి ప్రింట్ ని వెబ్ సైట్ లో పెట్టేస్తున్నారు . దాంతో చాలామంది దర్శక నిర్మాతలు అగ్ర హీరోలు బాధపడుతున్నారు . తాజాగా రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం కూడా పైరసి బారిన పడింది . అత్యంత భారీ బడ్జెట్ తో ఆసియా ఖండంలోనే ఆసక్తి గొలిపిన చిత్రం ఈ 2. ఓ . 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి పైరసీ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా కోర్టుని ఆశ్రయించారు . దాంతో దాదాపు 1200 వెబ్ సైట్ లను మూసెయ్యాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు . అయినప్పటికీ 2. ఓ పైరసీ బారిన పడింది .

సినిమా మొత్తం అది కూడా హెచ్ డి ప్రింట్ వెబ్ లీక్ కావడంతో ఏమి చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 11 వేల స్క్రీన్ లలో విడుదల అయ్యింది 2. ఓ చిత్రం . సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది దాంతో ఆ చిత్ర బృందం సంతోషంగా ఉండగా అదే సమయంలో లీక్ అయిన విషయం తెలియడంతో షాక్ కి గురయ్యారు .

English Title: Rajinikanth 2. 0 full movie leaked online