అడ్వాన్స్ బుకింగ్ లతోనే వంద కోట్లు రాబట్టిన 2. ఓ

Rajinikanth 2. 0సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లతోనే వంద కోట్ల ని రాబట్టింది ప్రపంచ వ్యాప్తంగా . రజనీకాంత్ కున్న క్రేజ్ ఒక కారణం అయితే , శంకర్ విజువల్ వండర్ తీసాడని భావిస్తున్న ప్రేక్షకులు 2 . ఓ టికెట్ల కోసం ఎగబడుతున్నారు . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వేల స్క్రీన్ లలో 2 . ఓ చిత్రం విడుదల అవుతోంది . ఇది రిలీజ్ ల పరంగా ఓ రికార్డ్ కాగా వసూళ్ల పరంగా కూడా రికార్డ్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి . ఎందుకంటే 11 వేల స్క్రీన్ లతో పాటుగా అడ్వాన్స్ బుకింగ్ లకు డిమాండ్ ఏర్పడటంతో అన్నీ ఫుల్స్ అయ్యాయి దాంతో ఫస్ట్ డే వసూళ్ల లో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది .

ఈ సినిమాకు రిపోర్ట్స్ కూడా పాజిటివ్ గా ఉండటంతో తప్పకుండా భారీ వసూళ్లు రావడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఈ సినిమాని చూసిన పలువురు సినీ ప్రముఖులు కూడా శంకర్ ప్రతిభని , రజనీకాంత్ స్టైల్ ని మెచ్చుకుంటున్నారు .మొత్తానికి రజనీకాంత్ కు రోబో చిత్రం తర్వాత సక్సెస్ దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రజనీ అభిమానులు .

English Title: Rajinikanth 2. 0 joins 100 crore club with advance booking