2.ఓ రిపోర్ట్ ఎలా ఉందంటే

Rajinikanth 2.0 movie public talkసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 2.ఓ చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. భారీ ఓపెనింగ్స్ సాధించిన 2. ఓ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఓవర్ సీస్ లో 2. ఓ షోలు ముందుగానే పడటంతో టాక్ బయటకు వచ్చేసింది. అంతేకాదు పలువురు నెటిజన్లు ఈ సినిమాని చూసి తమ రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్ లు చెబుతున్న దాని ప్రకారం 2.ఓ హిట్ అని తేల్చేశారు.

శంకర్ అద్భుత సృష్టి ఈ 2. ఓ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినిమా చూసిన వాళ్ళు. మొత్తానికి రజనీకాంత్ ఎనిమిది సంవత్సరాలు తర్వాత 2.ఓ చిత్రంతో హిట్ కొట్టాడు. రజనీకాంత్ నటన , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ల నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే చివరి అరగంట సినిమా హాలీవుడ్ ని తలదన్నేలా ఉందని అంటున్నారు.

English Title: Rajinikanth 2.0 movie public talk