క‌మ‌ల్‌, ర‌జ‌నీల‌తో మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మే!క‌మ‌ల్‌, ర‌జ‌నీల‌తో మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మే!
క‌మ‌ల్‌, ర‌జ‌నీల‌తో మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మే!

ద‌క్షిణాదిలో ఓ సంచ‌ల‌న చిత్రం తెర‌పైకి రాబోతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న కాంబినేష‌న్‌లో ఈ సినిమా రానుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌మిళ‌ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, య‌నివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ క‌లిసి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టించ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస కథ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రాన్ని `ఖైదీ`, మాస్ట‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. తాజాగా ఈ చిత్రంపై ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ స్పందించారు. ఇటీవ‌ల ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన లోకేష్ క‌న‌క‌రాజ్ త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ, క‌మ‌ల్ హాస‌న్‌ల‌తో రూపొందించ‌నున్న చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని మాత్రం త్వ‌ర‌లో మేక‌ర్స్ వెల్ల‌డిస్తార‌ని, అంత‌కు మించి ఈ చిత్రం గురించి మాట్లాడ‌టం మ‌రీ తొంద‌ర పాటు అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యానర్‌పై క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే అవ‌కాశం వున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీ `అన్నాత్తే` చిత్రంలో న‌టిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2 ` చిత్రంలో న‌టిస్తున్నారు.