రజనీకాంత్ దర్బార్ రిలీజ్ ఎప్పుడో తెలుసా


Rajinikanth Darbar locks release date
Rajinikanth Darbar locks release date

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది . లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఈ చిత్రాన్ని 2020 జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

అసలు ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే అనుకున్న స్థాయిలో షెడ్యూల్స్ పూర్తికాకపోవడంతో విడుదల వాయిదాపడింది . దసరా కు అనుకున్న సినిమాని సంక్రాంతి కి విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట . గతకొంత కాలంగా రజనీకాంత్ కు సరైన సక్సెస్ ఏది అందడం లేదు . చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి దాంతో ఈ సినిమా దర్బార్ అయినా హిట్ అవుతుందా ? అన్న టెన్షన్ రజనీ ఫ్యాన్స్ లో నెలకొంది .