నయనతార తో రొమాన్స్ చేస్తున్న రజనీ


Rajinikanth And Nayanathara
Rajinikanth And Nayanathara

సూపర్ స్టార్ రజనీకాంత్ నయనతార తో రొమాన్స్ చేస్తున్నాడు . ఈరోజు నుండి నయనతార – రజనీకాంత్ ల పై జైపూర్ లో పాట చిత్రీకరించనున్నారు దర్శకులు మురుగదాస్ . తాజాగా రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా నయనతార రజనీ సరసన నటిస్తోంది .

ఇటీవలే యాక్షన్ సీన్స్ తీసిన మురుగదాస్ నిన్న సాంగ్స్ కోసం జైపూర్ కు వెళ్లారు దర్బార్ యూనిట్ . అక్కడ ఈరోజు నుండి రజనీకాంత్ – నయనతార లపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నారు . చాలాకాలం తర్వాత రజనీకాంత్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు . సామాజిక అంశాన్ని స్పృశించే మురుగదాస్ ఈ దర్బార్ కోసం ఏ అంశాన్ని ఎంచుకున్నాడో !