వారికి శిక్ష త‌ప్ప‌దు – సూప‌ర్‌స్టార్


వారికి శిక్ష త‌ప్ప‌దు - సూప‌ర్‌స్టార్
వారికి శిక్ష త‌ప్ప‌దు – సూప‌ర్‌స్టార్

త‌మిళ నాడులోని తూత్తుకూడిలో తండ్రీ కొడుకుల లాక‌ప్ డెత్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దీనికి బాధ్యులైన పోలీసుల్ని క‌ఠినంగా శిక్షించాలంటూ నెటిజ‌న్స్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సంఘ‌ట‌న‌కు బాధ్యులైన పోలీసుల్ని మేజిస్ట్రేట్ విచారించిన సంద‌ర్భంగా స‌ద‌రు పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరుపై త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సంఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ర‌జ‌నీ అన్నారు. తూత్తుకూడిలో తండ్రి జ‌య‌రాజ్‌, కొడుకు బెనిక్స్ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా సెల్ పోన్ షాప్‌ని తెర‌వ‌డం వివాదానికి కార‌ణంగా మారింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా షాప్ ఓపెన్ చేశార‌ని ఆగ్ర‌హించిన పోలీసులు వారిద్ద‌రినీ ఆరెస్ట్ చేశారు. క‌ష్ట‌డీలో వున్న వారిని ఆ రోజంతా పోలీసులు విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్ట‌డంతో ఆ తండ్రీకొడుకులిద్ద‌రూ మ‌ర‌ణించారు.

ఈ లాక‌ప్ డెత్‌పై దేశం మొత్తం గ‌ళం విప్పింది. ర‌జ‌నీ కూడా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. జ‌య‌రాజ్‌, కొడుకు బెనిక్స్ ని దారుణంగా హింసించి చంప‌డాన్ని అంతా తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్న నేప‌థ్యంలో విచార‌ణ‌కు వ‌చ్చిన మెజిస్ట్రేట్‌నే కొంద‌రు పోలీసుల ప్ర‌వ‌ర్త‌న చూసి షాక్ కు గుర‌య్యాన‌ని ర‌జ‌నీ అన్నారు. ఈ కేసుతో సంబంధం వున్న వ్య‌క్తుల‌కు శిక్ష త‌ప్ప‌దు`  అని పోలీసుల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.