వెయ్యి మందికి త‌లైవా సాయం!


వెయ్యి మందికి త‌లైవా సాయం!
వెయ్యి మందికి త‌లైవా సాయం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా చాలా మంది జీవితాల్లో క‌ల్లోలం మొద‌లైంది. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌ని లేక‌పోవ‌డం నిత్యావ‌స‌రాల కోసం నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి అండ‌గా నిల‌వాల‌ని చాలా మంది సెల‌బ్రిటీలు, స్వ‌జ్ఛంద సంస్థ‌లు విరాళం ప్ర‌క‌టిస్తూ అండ‌గా నిలుస్తున్నాయి. మిగ‌తా వారితో పోలిస్తే చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన వారు క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల చాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

టాలీవుడ్ సినీ కార్మికుల కోసం సీసీసీ పేరుతో ఓ చారిటీని చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ప్రారంభించారు. ఇప్ప‌టికే చాలా మంది సినీ క‌ళాకారుల‌కు, కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల‌తో పాటు కొంత డ‌బ్బుని కూడా అందించారు. ఇదే త‌ర‌హాలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేద క‌ళాకారుల‌కు స‌హ‌యం అందించ‌డానికి ముందుకొచ్చారు.

ఇప్ప‌టికే ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ సౌత్ ఇండియాకు 50 ల‌క్ష‌లు విరాళం అందించిన ర‌జ‌నీ తాజాగా వెయ్యి మందికి నిత్యావ‌స‌ర స‌రుకులు అందించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. న‌డిగ‌ర్ సంఘంలో వున్న వెయ్యి మంది ఆర్టిస్ట్‌ల‌కు ఈ సాయాన్ని అందించ‌బోతున్నారు.