యాభై లక్షల సహాయం ప్రకటించిన రజనీకాంత్

Rajinikanth donation to gaja cyclone relief fundతమిళనాడులో గజ తుఫాన్ భీబత్సం సృష్టించడంతో భారీ ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్థి నష్టం సంభవించింది . దాంతో పెద్ద ఎత్తున తమిళనాడులో సహాయ సహకారాలు అందిస్తున్నారు . ఇప్పటికే పలువురు ప్రముఖులు సహాయం ప్రకటించగా తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తనవంతు సహాయంగా 50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు అంతేకాదు తన అభిమానులను సహాయ పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా ఆదేశించాడు . గజ తుఫాన్ ధాటికి తమిళనాడు విలవిలలాడుతోంది . అందుకే తనవంతు సహాయాన్ని అందిస్తున్నాడు రజనీకాంత్ .

రజినీ తో పాటుగా దర్శకులు శంకర్ కూడా పది లక్షల సహాయాన్ని ప్రకటించాడు . ఈ ఇద్దరి కాంబినేషన్ లో తాజాగా 2. 0 చిత్రం వస్తున్న విషయం తెలిసిందే . 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2 . 0 చిత్రం ఈనెల 29 న భారీ ఎత్తున విడుదల కానుంది . ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . 2010 లో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది . ఇక ఈ సినిమా ఎలాంటి ఫలితాలను రాబడుతుందో తెలియాలంటే 29 వరకు వెయిట్ చేయాల్సిందే .

English Title: Rajinikanth donation to gaja cyclone relief fund