రెండోసారి కూడా తప్పుచేసాడు


rajinikanth fans fire on pa ranjith

సూపర్ స్టార్ రజనీకాంత్ ని వరుసగా రెండుసార్లు అది కూడా వెంట వెంటనే డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు కానీ పా . రంజిత్ మాత్రం రెండుసార్లు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా రెండోసారి కూడా తప్పు చేసాడు అది కూడా క్షమించరాని తప్పు . కబాలి తో అభిమానుల తో పాటుగా బయ్యర్ లను నట్టేట ముంచిన పా . రంజిత్ కు వెంటనే మరో అవకాశం ఇచ్చాడు రజనీకాంత్ .

పా . రంజిత్ కు మరో అవకాశం ఇస్తున్నట్లు వార్తలు రావడంతో అది తప్పు అంటూ రకరకాల వార్తలు ప్రసారం అయ్యాయి కానీ రజనీకాంత్ మాత్రం వాటిని లెక్కచేయకుండా రంజిత్ కు మళ్ళీ చాన్స్ ఇచ్చాడు కానీ తాజాగా విడుదలైన కాలా చిత్రంతో మళ్ళీ ఫ్లాప్ చిత్రాన్నే తీసి తన దురదృష్టం ఏంటో తెలియజేసేలా చేసాడు పా . రంజిత్ . కబాలి , కాలా రెండు చిత్రాలు చేసే అవకాశం వచ్చినప్పుడు రెండో సారైనా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది కానీ రంజిత్ మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోలేదు . దాంతో కాలా చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు , అభిమానులు రంజిత్ తో పాటు రజనీకాంత్ ని కూడా విమర్శిస్తున్నారు .