ఆ హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం


Rajinikanth fans fires on Hero Jayam Ravi
Rajinikanth fans fires on Hero Jayam Ravi

తమిళ హీరో జయం రవి పై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . జయం రవి పై రజనీకాంత్ ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. జయం రవి నటించిన కోమలి చిత్రమే కారణం . కోమలి చిత్రంలో జయం రవి 16
సంవత్సరాల పాటు కోమాలో ఉంటాడు . కోమాలోంచి బయటకు వచ్చిన జయం రవికి టివి లో రజనీకాంత్ నటించిన క్లిప్ ప్లే అవుతుంటుంది . ఆ క్లిప్ లో రజనీకాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని అంటాడు .

అంటే 16 ఏళ్లుగా రజనీకాంత్ ఇదే విషయాన్ని అరిగిపోయిన రికార్డ్ లాగా చెబుతున్నాడు తప్పితే రాజకీయాల్లోకి మాత్రం రావడం లేదనే వెటకారంగా ఈ డైలాగ్ ఉందని అందుకే సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు . రజనీకాంత్ కు
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అతడి ఫ్యాన్స్ తో గోల ఎందుకని భావించిన కోమలి చిత్ర బృందం ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది .