రజనీకాంత్ ఆరోగ్యం బాగోలేదా ?


Rajinikanth fly to america with family
Rajinikanth

నిన్న సాయంత్రం రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళాడు . దాంతో సడెన్ గా అమెరికా ఎందుకు వెళ్లినట్లు అన్న చర్చ జరుగుతోంది . గతకొంతకాలంగా రజనీకాంత్ అనారోగ్యానికి గురి అవుతూనే ఉన్నాడు . గత ఎనిమిదేళ్లుగా అమెరికాలో అలాగే సింగపూర్ లో వైద్యం చేయించుకున్నాడు రజనీకాంత్ . అయితే తాజాగా మరోసారి అమెరికా వెళ్లడంతో రజనీ అనారోగ్యంతో ఉన్నాడా ? లేక ఫ్యామిలీ తో సరదాగా గడపడానికి వెళ్లాడా ? అన్నది తేలాల్సి ఉంది .

రజనీ నటించిన 2. ఓ చిత్రం ఇటీవలే విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇక కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన పెట్టా చిత్రాన్ని 2019 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రజనీకాంత్ తన కుటుంబంతో వెళ్ళింది  కొత్త సంవత్సర వేడుకలు అమెరికాలో జరుపుకోవడానికి అన్నట్లుగా తెలుస్తోంది . పనిలో పనిగా హెల్త్ చెకప్ కూడా చేయిచుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి .

English Title: Rajinikanth fly to america with family