లాంబోర్గి‌నీలో త‌లైవా షికారు చేస్తే…!


లాంబోర్గి‌నీలో త‌లైవా షికారు చేస్తే...!
లాంబోర్గి‌నీలో త‌లైవా షికారు చేస్తే…!

త‌లైవా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జీనీ కాంత్ మేనియా ఏ స్థాయిలో వుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న స్టైల్స్‌కి ఫిదా కాని వారంటూ వుండ‌రు. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ర‌జ‌నీ అభిమానులే. ఆ స్థాయి ఫాలోయింగ్ వున్న ర‌జ‌నీ బ‌య‌టికి వ‌స్తే ఫ్యాన్స్‌, మీడియా ఇట్టే గుర్తు ప‌ట్టేస్తుంది. సిర‌గ్గా ఇదే జ‌రిగింది. ముఖానికి ఎన్ 95 మాస్కు ధ‌రించి వైట్ అండ్ వైట్‌లో లాంబోర్గినీ కారులో హుషారుగా వెళుతున్న ర‌జ‌నీ మీడియా కంట‌ప‌డ్డారు.

దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మిళ‌నాడులో మ‌రీ ముఖ్యంగా చెన్నై మ‌హాన‌గ‌రంలో క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ప‌నివాల్లెవ‌రూ ప‌ని చేయ‌డానికి ఇల్లు వ‌దిలి బ‌య‌టికి రావ‌డం లేదు. దీంతో స్టార్సే బ‌య‌టికి వెళ్లి వ‌స్తున్నారు. ర‌జ‌నీ కూడా గ్రోస‌రీస్ కోసం లాంబోర్గినీ RT Max కారులో వెళ్లార‌ట‌. ఈ వార్త వితిన్ మినిట్స్‌లో బ‌య‌టికి రావ‌డం, సోష‌ల్ మీడియాలో వైర‌స్ కావ‌డం జ‌రిగిపోయింది.

త‌లైవా లాంబోర్గీనీలో బ‌య‌టికి రావ‌డానికి గుర్తించిన ఫ్యాన్స్ #LioninLomboghini అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టారు. ర‌జ‌నీ న‌టిస్తున్న తాజా చిత్రం `అన్నాతే`. సిరుతై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.