ర‌జ‌నీ `రానా` మ‌ళ్లీ తెర‌పైకి రానుందా?


ర‌జ‌నీ `రానా` మ‌ళ్లీ తెర‌పైకి రానుందా?
ర‌జ‌నీ `రానా` మ‌ళ్లీ తెర‌పైకి రానుందా?

తొమ్మిదేళ్ల క్రితం ర‌జ‌నీకాంత్ చేయాల‌నుకున్న సినిమా `రానా`. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె. ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించారు. ఇందులో ర‌జ‌నీకి జోడీగా దీపిక ప‌దుకునేని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి  చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని కూడా రిలీజ్ చేశారు. కానీ ర‌జ‌నీకి హ‌ఠాత్తుగా అనారోగ్యానికి గురికావ‌డంతో ఈ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టారు.

మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఈ చిత్రాన్ని మళ్లీ మొద‌లుపెట్టాల‌ని ద‌ర్శ‌కుడు కె.ఎస్‌. ర‌వికుమార్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ  భావిస్తున్నార‌ట‌. ఆరు నెల‌ల క్రితం ర‌జ‌నీ త‌న‌ని మ‌ళ్లీ స్క్రిప్ట్ చెప్ప‌మ‌న్నార‌ని, ప్ర‌స్తుతం గ‌తంలో అనుకున్న `రానా` ఇప్పుడు మ‌నం మ‌ళ్లీ చేయ‌గ‌ల‌మా? అని ర‌జ‌నీ త‌న‌ని అడిగార‌ని, ఎందుకు చేయ‌లేం ఖ‌చ్చ‌తంగా చేయ‌గ‌ల‌మ‌ని తాను చెప్పిన‌ట్టు ద‌ర్శ‌కుడు కె.ఎస్‌. ర‌వికుమార్ ఓ జాతీయ మీడియాకు వెల్ల‌డించారు.

ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన ప‌నుల్లో బిజీగా వున్నార‌ని, బ‌హుశా వ‌చ్చే ఏడాది ఈ మూవీ కార్య‌రూపం దాల్చే అవ‌కాశం వుంద‌ని త‌మిళ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం భార‌తీయ చిత్రాల మార్కెట్ స్థాయి పెరిగిన నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని చేయ‌డం ఏమంత క‌ష్ట‌మైన ప‌నేమీ కాద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ‌పిరియాడిక్ డ్రామాగా తెర‌పైకి తీసుకు‌రావాల‌నుకున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా న‌టించాల‌నుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్లాన్ చేశారు. కానీ ర‌జ‌నీ అనారోగ్యానికి గురికావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టారు.