కాలా రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా


rajinikanth kaala first reviewసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రానికి రివ్యూ రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సందు . ప్రతీ అగ్ర హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు కాస్త ముందుగానే రివ్యూ ఇచ్చేస్తాడు ఇక రేటింగ్ కూడా అట్టర్ ప్లాప్ సినిమాకు కూడా 3 , 4 ఇస్తుంటాడు ఇతగాడు .ఉమైర్ సందు రేటింగ్ ఇచ్చిన సినిమాలు దాదాపుగా అట్టర్ ప్లాప్ అయ్యాయి అయితే మచ్చుకి ఓ పది సినిమాల లోపు మాత్రం హిట్ అయ్యాయి .

తాజాగా రజనీకాంత్ కాలా చిత్రానికి కూడా రేటింగ్ ఇచ్చాడు ఇతగాడు . ఇంతకీ కాలా రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా ……. 4 . అవును కాలా కు 4 రేటింగ్ ఇచ్చాడు . రజనీకాంత్ , నానా పటేకర్ ల నటన బాగుందని , సినిమా హృదయాలకు హత్తుకునేలా ఉందని ఇక క్లైమాక్స్ గురించి అయితే చెప్పక్కర్లేదని ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని అంటున్నాడు . ఉమైర్ సందు రివ్యూ పక్కన పెడితే సెన్సార్ టాక్ కూడా బాగానే ఉంది మరి కాలా చిత్రానికి . రజనీకాంత్ సరసన ఈశ్వరి రావు , హుమా ఖురేషి నటించగా ధనుష్ ఈ చిత్రాన్ని పా . రంజిత్ దర్శకత్వంలో నిర్మించాడు . ఇక కాలా సంగతి ఏంటి అన్నది మరికొద్ది సేపట్లో తెలుగు ప్రేక్షకులు తేల్చబోతున్నారు .