బిజినెస్ లో రికార్డుల మోత మోగించిన రజనీ కాలా


rajinikanth kaala pre release business creates recordsసూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం అంటే ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది దాంతో అతడి సినిమా ఎలా ఉన్నప్పటికీ రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం ఖాయం . అసలు రజనీకాంత్ నటించిన చిత్రాలు గతకొన్ని సంవత్సరాలుగా సూపర్ హిట్ కావడం లేదు కానీ బిజినెస్ లో మాత్రం ఎప్పటికప్పుడు చరిత్ర సృష్టిస్తూనే ఉన్నాయి . ఇక ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఆ సినిమా వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం . కబాలి అంతగా ఆడకపోయినా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల వసూళ్ల ని సాధించింది . ఇంతటి వసూళ్ల కు కారణం కేవలం రజనీకాంత్ మేనియా మాత్రమే ! ఇక కబాలి దర్శకుడి తోనే మళ్ళీ ” కాలా ” చిత్రం చేసాడు రజనీకాంత్ . ఆ సినిమా విడుదలకు ముందే 260 కోట్ల బిజినెస్ చేసింది .

ఏరియాల వారీగా కాలా బిజినెస్ ఇలా ఉంది
తమిళనాడు – 70 కోట్లు
ఏపీ – తెలంగాణ – 33 కోట్లు
కేరళ – 10 కోట్లు
ఓవర్ సీస్ – 45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 7 కోట్లు
శాటిలైట్ హక్కులు అన్నీ కలిపి – 70 కోట్లు
ఆడియో – 5 కోట్లు
కర్ణాటక – 20 కోట్లు
మొత్తం – 260 కోట్లు