త‌లైవా పార్టీ సింబ‌ల్ వ‌చ్చేసింది!


త‌లైవా పార్టీ సింబ‌ల్ వ‌చ్చేసింది!
త‌లైవా పార్టీ సింబ‌ల్ వ‌చ్చేసింది!

త‌లైవా.. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్  మరో రెండు వారాల్లో తన రాజకీయ పార్టీని ప్రకటించి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ మొద‌లైంది. కొత్త‌గా పార్టీ స్థాపించ‌బోతున్న ర‌జ‌నీ త‌మిళ రాజ‌కీయాల్లో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీయ‌నున్నాడ‌న్న‌ది ప్రస్తుతం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తలైవా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రజిని రాజకీయ పార్టీ పేరు `మక్కల్ సేవై కర్చి` అని పార్టీ గుర్తు ‘ఆటో రిక్షా’ గా వుండే అవ‌కాశాలే అత్య‌ధికంగా క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఉమ్మడి ఎన్నిక‌ల గుర్తుని కేటాయించాలని కోరుతూ భార‌త ఎన్నికల సంఘానికి మక్కల్ సేవై కచ్చి నుండి ఒక దరఖాస్తు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

రజనీ త‌న ఎన్నిక‌ల గుర్తుగా `ఆటో రిక్షాని` ఎంచుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణం కూడా వుంద‌ని చెబుతున్నారు.  90 వ దశకంలో ర‌జ‌నీ న‌టించిన `బాషా` ఏ స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఈ మూవీ ద్వారా ర‌జ‌నీ పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయ్యారు. ఇందులో ఆయ‌న ఆటో డ్రైవ‌ర్‌గా క‌నిపించారు. కింది స్థాయి వ‌ర్గానికి చేరువ కావ‌డానికి ఈ గుర్తు బాగా ప‌నికి వ‌స్తుంద‌ని, సెంటిమెంట్‌గా కూడా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ర‌జ‌నీ ఆటో రిక్షా గుర్తుని ఎంచుకున్నార‌ట‌. ఇదిలా వుంటే ర‌జ‌నీ పార్టీ ప్ర‌క‌ట‌న ఈ నెల 31న చేయ‌నున్న విష‌యం తెలిసిందే.