2. ఓ రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

Rajinikanth' s 2.0 review ratingరజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం రేపు విడుదల అవుతుండగా ఈరోజు ఉమైర్ సందు తన రేటింగ్ ఇచ్చేసాడు . ఇతగాడు ఇచ్చిన రివ్యూ రేటింగ్ లన్ని బోగస్ అనే తేలాయి ఎందుకంటే ఉమైర్ సందు 4 రేటింగ్ ఇచ్చిన సినిమాల్లో ఒకటి అరా తప్ప మిగతా సినిమాలు అన్నీ డిజాస్టర్ లు , ప్లాప్ లు , యావరేజ్ లు మాత్రమే ! ఇంతకీ ఈ వివాదాస్పద క్రిటిక్ 2 . ఓ కి ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ……. 4 . అవును యధావిధంగా ఈ సినిమాకు కూడా 4 రేటింగ్ ఇచ్చాడు . 4 రేటింగ్ ఇచ్చి డబ్బా కొట్టాడంటే సెంటిమెంట్ ప్రకారం ప్లాప్ అన్నమాటే ! కానీ చెప్పలేం ఏం జరుగుతుందో అసలు తీర్పు ప్రేక్షకులు కదా ఇవ్వాలి . ఆ తీర్పు రేపు ఇవ్వనున్నారు .

ఉమైర్ సందు రివ్యూ ప్రకారం 2 . ఓ విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని , రజనీకాంత్ – అక్షయ్ కుమార్ ల నటన ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని , అలాగే శంకర్ దర్శకత్వ ప్రతిభ అమోఘమని తెగ డప్పు కొడుతున్నాడు . విజువల్ ఫీస్ట్ 2. ఓ అని తేల్చి పడేసాడు ఉమైర్ సందు . అసలు రిపోర్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈ రిపోర్ట్ మాత్రం రజనీ అభిమానులను సంతోషానికి , భయానికి గురిచేస్తోంది . సంతోషం , భయం ఈ రెండింటికి ఉమైర్ సందు కారణం . బాగుంది అని చెప్పడం సంతోషమైతే …… 4 రేటింగ్ ఇవ్వడంతో భయపడుతున్నారు పాపం .

English Title: Rajinikanth’ s 2.0 review rating