వైర‌ల్ అవుతున్న ర‌జ‌నీ లేఖ‌!


వైర‌ల్ అవుతున్న ర‌జ‌నీ లేఖ‌!
వైర‌ల్ అవుతున్న ర‌జ‌నీ లేఖ‌!

త‌మిళ సూపర్‌స్టార్ ర‌జనీ కాంత్ సోమ‌వారం భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న‌ని భాధ‌పెట్టొదంటూ అభిమానులకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లెట‌ర్‌ని షేర్ చేశారు. ప్ర‌స్తుతం త‌మిళంలో ర‌జ‌నీ షేర్ చేసిన ఈ లేఖ వైర‌ల్ అవుతోంది. అనారోగ్య కార‌ణాల దృష్ట్యా త‌ను రాజ‌కీయ పార్టీని ప్రారంభించ‌డం లేదంటూ ర‌జ‌నీ ప్ర‌క‌టించి అభిమానుల‌కు షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

ఈ విష‌యం తెలియ‌డంతో తీవ్ర నిరాశ‌కు గురైన ర‌జ‌నీ ఫ్యాన్స్ గ‌త కొన్ని రోజులుగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఆదివారం ర‌జ‌నీ త‌న నిర్ణ‌యా‌న్ని వెన‌క్కు తీసుకోవాలంటూ ఒత్తిడి చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ సంద‌ర్భంగా  ధ‌ర్నాకు దిగ‌డంతో త‌మిళ‌నాట ర‌జ‌నీ రాజ‌కీయ అరంగేట్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యం ర‌జ‌నీకి తెలియ‌డంతో ర‌జ‌నీ మ‌న‌స్తాపానికి గుర‌య్యార‌ట‌.

ఇదే విష‌యాన్ని ర‌జ‌నీ లేఖ‌లో పేర్కొన్నారు. ఆరోగ్య కార‌ణాల దృష్ట్యా రాజ‌కీయాల్లోకి రాన‌ని చెప్పాన‌ని, నా  నిర్ణ‌యాన్ని మార్చుకోమ‌ని త‌న‌ని ఒత్తిడి చేయ‌వ‌ద్దంటూ స‌ద‌రు లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. అభిమానుల ప్ర‌వ‌ర్త‌న‌తో తాను క‌ల‌త చెందాన‌ని ర‌జ‌నీ ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోను కావ‌డం త‌మిళ నాట సంచ‌ల‌నంగా మారింది. ర‌జ‌నీ లేఖ‌పై అభిమాన సంఘాలు ఎలా స్పందిస్తారో చూడాలి.