రజనీ కూతుర్ని పెళ్లి చేసుకుంది ఇందుకే అయితే


రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఇటీవలే విశాగన్ వనంగమూడి ని పెళ్లి చేసుకుంది సౌందర్య . విశాగన్ వ్యాపారవేత్త అయినప్పటికీ సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంది దాంతో ఒక సినిమాలో హీరోగా నటించాడు కూడా కానీ అది రిలీజ్ అయినట్లు కూడా అంతగా తెలియదు దాంతో ఇప్పుడు రజనీకాంత్ కు చిన్నల్లుడు కాబట్టి ఆ ఇమేజ్ తో నెట్టుకురావాలని చూస్తున్నాడు .

ఇంకేముంది సోషల్ మీడియాలో విశాగన్ ని తూర్పార బడుతున్నారు నెటిజన్లు . సినిమాలో హీరోగా నటించడానికి , రజనీకాంత్ ఇమేజ్ ని అడ్డు పెట్టుకుంటున్నాడు అందుకే సౌందర్య ని రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ విశాగన్ పై మండిపడుతున్నారు . నెటిజన్ల విమర్శలు పక్కన పెడితే విశాగన్ చేసుకుంది అందుకే అనిపిస్తోంది . అప్పుడే రజనీకాంత్ తన చిన్నల్లుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట . పాపం తప్పదు కదా కూతురు కోసం మరి .