త‌లైవాకు త‌ప్పిన ప్ర‌మాదం!Rajinikanth special flight on technical trouble
Rajinikanth special flight on technical trouble

గ‌త కొంత కాలంగా కాలంగా త‌నదైన మార్కు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయిన ర‌జ‌నీకాంత్ తాజాగా `ద‌ర్బార్‌`తో ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన విష‌యం తెలిసిందే. ర‌జ‌నీ మార్కు మెరుపుల‌తో, టెర్రిఫిక్ యాక్ష‌న్ డ్లాక్స్‌తో వ‌చ్చిన ఈ చిత్రం ఈ జ‌న‌వ‌రి 9న రిలీజై అనూహ్య విజ‌యాన్ని సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన ఈ చిత్రం రెండు వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో  చేర‌డం విశేషం. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ ఆనందంలో వున్న ర‌జ‌నీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మొద‌లుపెట్టారు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుండ‌గా ఈ రోజు (సోమ‌వారం` ర‌జ‌నీ ఎక్కిన విమానం సాంకేతిక లోపం కార‌ణంగా ర‌న్‌వేపైనే రెండు గంట‌ల పాటు ఆగాల్సి వ‌చ్చింద‌ని తెలిసింది. చెన్నై నుంచి మైసూర్ వెళ్ల‌వ‌లిసిన ప్ర‌త్యేక విమానంలో ర‌జ‌నఈ వున్నారు. అయితే అందులో వున్న‌ట్టుండి సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ర‌జ‌నీతో పాటు అందులో ప్ర‌యాణిస్తున్న వాళ్లంతా ఒక్క‌సారిగా షాక్ గుర‌య్యార‌ట‌.

ఈ విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో ర‌జ‌నీ అభిమానులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రెండు గంట‌ల పాటు శ్ర‌మించిన విమాన సిబ్బంది సాంకేతిక లోపాన్ని స‌రిచేయ‌డంతో చివ‌రికి ర‌జ‌నీ వున్న విమానం సేఫ్‌గా మైసూన్ వెళ్ల‌న‌ట్టు త‌మిళ చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో ర‌జ‌నీ అభిమానులు ఊప‌రి పీల్చుకున్నారు.