రజనీకాంత్ భయపడుతున్నాడా ?


Rajinikanth to not contest in Lok Sabha elections

పేరుకి రాజకీయాల్లోకి వస్తున్నాను , రాజకీయ పార్టీని పెడుతున్నాను అంటూ గొప్పగా ప్రకటించాడు సూపర్ స్టార్ రజనీకాంత్ . కానీ రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత మాత్రం మళ్ళీ ఆ ఊసే లేకుండా పోయింది . ఇక మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అయితే ఆ ఎన్నికల్లో మాత్రం నా రాజకీయ పార్టీ పోటీ చేయడం లేదు అలాగే నేను కూడా పోటీ చేయడం లేదు అంటూ ప్రకటన జారీ చేసాడు రజనీకాంత్ .

 

ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది రజనీకాంత్ వ్యవహారం . కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ తో ఎందుకు గొడవలు అని భయపడుతున్నట్లున్నాడు రజనీకాంత్ . అందుకే పోటీ కి వెనుకాడుతున్నాడు అని విమర్శలు వస్తున్నాయి . తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది జయలలిత మరణం తర్వాత . జయలలిత మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని ఆడిస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి  అలాంటి సమయంలో రజనీ తన సత్తా చాటాల్సింది పోయి మిన్నకుండి పోతున్నాడు అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని ప్రకటించాడు .

 

English Title: Rajinikanth to not contest in Lok Sabha elections