ర‌జ‌నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌ళ్లీ స్టార్ట్ కాబోతోందా?


ర‌జ‌నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌ళ్లీ స్టార్ట్ కాబోతోందా?
ర‌జ‌నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌ళ్లీ స్టార్ట్ కాబోతోందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవ‌ల అనారోగ్య కార‌ణాల వ‌ల్ల త‌ను న‌టిస్తున్న `అన్నాత్తే` చిత్రాన్ని తాత్కాలికంగా ఆపేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఇదిలా వుంటే ర‌జ‌నీ గ‌త కొన్నేళ్ల క్రితం ఆపేసిన త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌ని తిరిగి మ‌ళ్లీ ప్రారంభిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

కె.ఎస్.రవి కుమార్ – ర‌జ‌నీల కలయికలో `రానా` పేరుతో ఓ పిరియాడిక‌ల్ చిత్రాన్ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్రారంభ ద‌శ‌లోనే ఆగిపోయింది. అయితే ఈ హిస్టారిక‌ల్ మూవీని తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది. స్వ‌యంగా ఈ విస‌యాన్ని ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవి కుమార్ వెల్ల‌డించారు.
ఇటీవ‌ల చెన్నైలో `ఆండ్రాయిడ్ కుంజప్పన్` తమిళ రీమేక్ లాంచ్ కార్యక్రమంలో ప్రసంగించిన కెఎస్ రవి కుమార్ రజనీకాంత్‌తో సన్నిహితంగా ఉన్నట్లు ధృవీకరించారు. `నేను రజనీకాంత్ సార్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాను. ఆరు నెలల క్రితం నేను `రానా` స్క్రిప్ట్‌ను మరోసారి వివరించాను. ఆయ‌న‌ దానిని పూర్తిగా ఇష్టపడ్డారు. ర‌జ‌నీ కోలుకున్న తర్వాత దీన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను` అని కె.ఎస్.రవికుమార్ వెల్లడించారు.