ఆ విషయంలో రజనీకాంత్ చాలా ఆగ్రహంగా ఉన్నాడట


Rajinikanth
Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ నడిగర్ సంఘం ఎన్నికల పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నాడట . గత ఎన్నికల్లోనే తీవ్ర విభేదాలతో ఎన్నికలు జరిగాయి కాగా ఈసారి అయితే ఏకంగా రాజకీయ పార్టీల ఎన్నికలను తలపించే విధంగా నడిగర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న వాళ్ళు ఇరు పక్షాలు కూడా బురద జల్లుకోవడంతో రజనీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట అందుకే కారణం ఏదైనా ఈసారి ఎన్నికల్లో ఓటు వేయలేకయాడు .

విశాల్ తెలుగువాడు తమిళనాడులో పెత్తనం చేయడం ఏంటి ? అంటూ వివాదాన్ని పెద్దగా చేసారు . అలాగే పలువురు తమిళులు ఇదే విషయాన్నీ హైలెట్ చేస్తూ విశాల్ పై తీవ్ర విమర్శలు చేసారు . ఇక విశాల్ కూడా తక్కువేమి తినలేదు , విశాల్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసాడు దాంతో రజనీకాంత్ ఇరు వర్గాల పట్ల ఆగ్రహంగా ఉన్నాడట . ఈ ఎన్నికలకు ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా ? అని రజనీ అసంతృప్తితో ఉండటం వల్లే ఓటు వేయలేదట .