ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్

Rajinikanth warning his fans సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు . ఇంతకీ రజనీ తన అభిమానులకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా ….. రజనీ నటించిన ” 2. 0 ” ఈనెల 29 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . అయితే అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతుంటే ఆ చిత్రానికి భారీ ఎత్తున ఒత్తిడులు ఉండటం సహజం . అలాగే రిలీజ్ రోజునే సినిమా చూడాలని తహతహలాడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు . దాంతో టికెట్ ల రేట్లు చుక్కలను అంటుకుంటాయి. ఏకంగా ఒక్కో టికెట్ ధర 1000 నుండి 5 వేల రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముతుంటారు . అమ్మేవాళ్ళ కంటే ఎంత రేటు అయినా ఫరవాలేదు ముందుగా సినిమా చూడాలి అని భావించేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు అందుకే టికెట్ రేట్లు అగ్ర హీరోల సినిమాలకు పెరుగుతూనే ఉంటుంది .

అలాంటి వాళ్ళని రజనీకాంత్ హెచ్చరిస్తున్నాడు . టికెట్ రేట్లు థియేటర్ వాళ్ళు పెంచొద్దు అలాగే అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనద్దు అంతేకాదు అమ్మేవాళ్ళు కూడా నేరం చేసినట్లే ! అలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసాడు రజనీకాంత్ . అయితే రజనీకాంత్ వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన అభిమానులు ఊరుకుంటారా ? మొదటి రోజున సినిమా చూడాల్సిందే కాబట్టి ఎంత రేటు అయినా ఫరవాలేదు అని ముందుకు రావడం ఖాయం .

English Title: Rajinikanth warning his fans