2 నిమిషాల వీడియో లీక్


Rajinikanths 2.0 another video leakedసినిమా తాలూకు రష్ హెచ్ డి క్వాలిటీ తో లీక్ అవుతుంటే పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు తలలు పట్టుకుంటున్నారు . ఇప్పటికే పలు చిత్రాల వీడియో ఫుటేజ్ లీక్ అవ్వగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ లీక్ లు అవుతూనే ఉన్నాయి . తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” రోబో ” సీక్వెల్ ” 2. 0” కు సంబందించిన మేకింగ్ వీడియో ఫుటేజ్ లీక్ కావడంతో ఆ చిత్ర బృందం షాక్ అయ్యారు . దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్ తో ఏషియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ 2. 0 చిత్రం .

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈఏడాది నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మూడేళ్ళుగా చిత్ర నిర్మాణం చేసుకుంటున్న ఈ సినిమా ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూనే ఉంది గ్రాఫిక్స్ కారణంగా . అయితే తాజాగా 2 నిమిషాల వీడియో లీక్ కావడంతో దిమ్మ తిరిగిపోయిందట . ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ ఇది మాత్రం తప్పడం లేదే అని తెగ ఇదై పోతున్నారట . ఎక్కడి నుండి లీకైంది ? ఎవరు లీక్ చేసారు ? అన్న కోణంలో కూపీ లాగుతున్నాడట దర్శకులు శంకర్ .

English Title: rajinikanths 2.0 another video leaked