రజనీకాంత్ 2. 0 సెన్సార్ టాక్ ఎలా ఉందంటే

Rajinikanth's 2.0 censor talk సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ” 2. 0 ” సెన్సార్ కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తిచేసుకుంది . శంకర్ దర్శకత్వంలో 540 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది 2. 0. రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక సెన్సార్ విషయానికి వస్తే ….. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు దర్శకుడు శంకర్ ని ప్రశంసలతో ముంచెత్తారు . హీరో రజనీకాంత్ నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనుందని , అద్భుతమైన విజువల్స్ , గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని పొగడ్తల వర్షం కురిపించారట .

రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిట్టి హీరో కాగా రోబో లో చిట్టి విలన్ అన్న విషయం తెలిసిందే . బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ , హాట్ భామ అమీ జాక్సన్ పాత్రలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని అంటున్నారు . సెన్సార్ సభ్యులు 2. 0 చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తడంతో సినిమా విజయం పట్ల సంతోషంగా ఉన్నారట . అయితే సెన్సార్ సభ్యుల తీర్పు వచ్చింది కానీ ప్రేక్షకుల తీర్పు అసలు సిసలైన తీర్పు కావడంతో ఆ రోజు కోసం వెయిట్ చేయాల్సిందే . నవంబర్ 29 న 2. 0 రిజల్ట్ ఏంటి అన్నది తేలిపోనుంది .

English Title: Rajinikanth’s 2.0 censor talk