నిరాశపరిచిన 2. 0 ట్రైలర్


Rajinikanth's 2.0 Trailer disappoints the Audiences

ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ” 2. 0” . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు చెన్నై మహానగరంలో అట్టహాసంగా విడుదల అయ్యింది . రజనీకాంత్ సినిమా కావడం శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో ఈ ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఆ అంచనాలను తాకే స్థాయిలో లేకపోవడంతో రజనీ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు కూడా చాలా నిరాశపడ్డారు . భారీ విజువల్స్ ఉన్నప్పటికీ , అతున్నత సాంకేతికంగా సినిమా రూపొందినప్పటికీ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే అంశాలు పెద్దగా లేకపోవడంతో ట్రైలర్ డిజప్పాయింట్ చేసిందని ఏకంగా సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు .

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది 2.0 చిత్ర ట్రైలర్ . ట్రైలర్ బాగానే ఉన్నపటికీ అభిమానులు , ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో అయితే లేదు . 540 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెలాఖరున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సూపర్ స్టార్ రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు నటించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు . సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉంటుందా ? లేదా ? అన్నది చూడాలి .

English Title:  Rajinikanth’s 2.0 Trailer disappoints the Audiences