గ్రాండ్ లెవల్లో విడుదల కానున్న 2.0 ట్రైలర్


Rajinikanth's 2.0 trailer launch in grand manner

ఈరోజు మధ్యాహ్నం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. 0 ట్రైలర్ ని అట్టహాసంగా చెన్నై లో విడుదల చేయనున్నారు . 540 కోట్ల భారీ బడ్జెట్ తో ఆసియా ఖండంలోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది 2 .0 . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . 2010 లో వచ్చిన రోబో ప్రభంజనం సృష్టించింది కాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోంది ఈ చిత్రం .బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది . ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పటి లానే చిట్టి రోబో గా రానున్నాడు అయితే రోబో లో వినాశనం కోసం ప్రయత్నించే చిట్టి కాగా ఇందులో వినాశకుల పాలిట మృత్యువు గా కనిపించనున్నాడు .

ఇక ఈరోజు చెన్నై లో గ్రాండ్ లెవల్లో ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా , ట్రయిలర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం వ్యూస్ లో రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది 2. 0 చిత్రం . రజనీకాంత్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై అందరి కళ్ళు ఉన్నాయి . ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ? సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు . దాంతో ట్రైలర్ రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: Rajinikanth’s 2.0 trailer launch in grand manner