టీజర్ తో ఫ్యాన్స్ ని అలరించిన రజనీకాంత్


Rajinikanth's petta teaser talk
Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే 2. ఓ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే , ఇక తాజాగా ” పెటా ” చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రజనీకాంత్ . తాజాగా రజనీకాంత్ నటించిన చిత్రం పెటా . యువ దర్శకులు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఆ సినిమా లుక్ ఇప్పటికే ఫ్యాన్స్ ని విశేషంగా అలరించగా తాజాగా టీజర్ ని విడుదల చేసారు .

పెటా టీజర్ ని చూసిన రజనీ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు . రజనీ లుక్ , స్టైల్ అదిరిపోయేలా ఉంది దాంతో పెటా సినిమా హిట్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు . ఎందుకంటే 2. ఓ చిత్రం లో పూర్తిస్థాయి రజనీకాంత్ ని చూడలేకపోయారు అది టెక్నీకల్ వండర్ అయితే పెటా మాత్రం కమర్షియల్ హిట్ అవ్వడం ఖాయమని అలాగే ఊర మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని నమ్ముతున్నారు .

English Title: Rajinikanth’s petta teaser talk