
గత మూడేళ్లుగా ఊరిస్తున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మొత్తానికి రాకీయ ఎంట్రీ సిద్ధమయ్యారు. గురువారం ఆయన తన రా.కీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని, రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సంతోషపడతానని తలైవా అన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించిన అనంతరం రజనీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే వున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.
అయితే తన రాజకీయ అరంగేట్రానికి వైద్యులు అడ్డు చెబుతున్నా ప్రజలు, అభిమానుల కోసం తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయ అరంగేట్రం కోసం రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదని చెప్పారు. తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలపై వెనక్కి వెళ్లను. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతో వుంది. ఇప్పుడు రాకపోతే మరెప్పటికీ రాదు. ప్రజలు నా వెంట వుంటే మన మంతా కలిసి మార్పుని తీసుకొద్దాం` అన్నారు.
తన రాజకీయ అరంగేట్రంపై గ తమూడేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు గురువారం రజనీ తెరదించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలని డిసెంబర్ 31న వివరిస్తానని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. `త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం` అని ట్వీట్ చేశారు.