రజనీకాంత్ కాలా ట్రైలర్ వచ్చేసింది


rajnikanth kaala trailer outసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” ట్రైలర్ వచ్చేసింది . రజనీకాంత్ లోని పవర్ ఫుల్ కోణమే కాదు రొమాంటిక్ యాంగిల్ కూడా ఆవిష్కరించాడు పా రంజిత్ . రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్ర నిర్మాత కావడం విశేషం . రజనీకాంత్ సరసన ఈశ్వరీ రావు , హుమా ఖురేషీ లు నటించగా విలన్ గ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటించాడు . నానా పటేకర్ డైలాగ్ కింగ్ అన్న విషయం తెలిసిందే , నానా పటేకర్ చెప్పే డైలాగ్ కి చేసే యాక్షన్ కి ఫిదా అయిపోయాడట రజనీకాంత్ . కాలా చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనదని ఎందుకంటే నానా పటేకర్ తో పోటీపడి నటించాల్సి రావడం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు రజనీ .

జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ధనుష్ . కబాలి వంటి ప్లాప్ తర్వాత పా . రంజిత్ కు మళ్ళీ దర్శకత్వం చేసే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు రజనీకాంత్ . ఇప్పటికే కాలా పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెరగడం ఖాయం . డాన్ గా రజనీ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే జూన్ 7 వరకు ఎదురు చూడాల్సిందే .