రాజుగాడు రివ్యూ


raju gadu reviewరాజుగాడు రివ్యూ
నటీనటులు : రాజ్ తరుణ్ , అమైరా దస్తూర్ , రాజేంద్ర ప్రసాద్
సంగీతం : గోపిసుందర్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం : సంజనా రెడ్డి
రేటింగ్ : 2 / 5
రిలీజ్ డేట్ : 1 జూన్ 2018

రాజ్ తరుణ్అమైరా దస్తూర్ జంటగా సంజనా రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ” రాజుగాడు ”. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

తనకు తెలియకుండానే దొంగతనం చేసే అలవాటున్న రాజు ( రాజ్ తరుణ్ ) దొంగతనాలు చేస్తూ ఇబ్బందుల పాలు అవుతుంటాడు . దొంగతనాలతో తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టే రాజుగాడు తన్వీ ( అమైరా దస్తూర్ ) ని ప్రేమిస్తాడు . తన్వీ కూడా రాజుగాడి ని ప్రేమిస్తుంది . అయితే దొంగతనం చేసే జబ్బు రాజుగాడి కి ఉందని తెలిసి తన్వీ రాజుగాడి కి దూరం అవుతుంది . దొంగతనం చేసే జబ్బు వల్ల ఎలాంటి ఇబ్బంది పడ్డాడు ? చివరకు తన ప్రేమని గెలిపించుకున్నాడా ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రాజ్ తరుణ్
రాజేంద్ర ప్రసాద్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . రాజ్ తరుణ్ తండ్రి పాత్రలో నటించిన రాజేంద్రుడు తన ప్రతిభతో మరింతగా నవ్వించాడు . రాజ్ తరుణ్ కూడా దొంగతనం చేసే జబ్బున్న క్యారెక్టర్ ని బాగా పండించాడు . రాజ్ తరున్ – అమైరా దస్తూర్ ల జంట బాగుంది . అమైరా దస్తూర్ కి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగా చేసింది అలాగే గ్లామర్ గా కనిపించి మార్కులు కొట్టేసింది . 30 ఇయర్స్ పృథ్వీ కూడా నవ్వలు పంచాడు .

సాంకేతిక వర్గం :

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి , దర్శకురాలు సంజన రెడ్డి విషయానికి వస్తే ……. హీరో క్యారెక్టర్ కు జబ్బు అంటించి ఫన్ జనరేట్ చేయాలనీ బాగానే ప్రయత్నాలు చేసింది కానీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది . కొన్ని చోట్లా బాగానే డీల్ చేసినప్పటికీ ఓవరాల్ గా మాత్రం మెప్పించలేక పోయింది . రాజశేఖర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కాగా సంగీతం అంతగా ఆకట్టుకోదు , గోపిసుందర్ సంగీతం అందించాడు .

ఓవరాల్ గా :

రాజుగాడు మిస్ ఫైర్ అయ్యాడు

                  Click here for English Review