లాభాల్లోకి అడుగుపెట్టనున్న రాజు గారి గది 3


లాభాల్లోకి అడుగుపెట్టనున్న రాజు గారి గది 3
లాభాల్లోకి అడుగుపెట్టనున్న రాజు గారి గది 3

ఓంకార్ తెరకెక్కించిన రాజు గారి గది 3కి మిక్స్డ్ టాక్, రివ్యూలు వచ్చినా కానీ ఈ చిత్రం సేఫ్ వెంచర్ అయ్యే దిశగా పయనిస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 3.75 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెండు రోజులకు రెండున్నర కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆదివారం నాడు మరో కోటి రూపాయలు వసూలు చేసింది. దీంతో రాజు గారి గది 3 వీకెండ్ కే 3.5 కోట్ల షేర్ సాధించి ఈరోజు లాభాల్లోకి అడుగుపెట్టనుంది.

సోమవారం నుండి వచ్చిన వసూళ్ల బట్టి ఈ చిత్రం రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. రాజు గారి గది సిరీస్ లో గత చిత్రాల మాదిరే ఇది కూడా హారర్ కామెడీ జోనర్ లోనే తెరకెక్కింది. అయితే ఈ చిత్రాన్ని క్రిటిక్స్ ఏకిపారేశారు. హారర్ కామెడీ బోర్ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. కానీ రాజు గారి గది 3కి మాస్ ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుంది. బి, సి సెంటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.

ఓంకార్ ఇప్పటికే తన తర్వాత చిత్రం కూడా రాజు గారి గది సిరీస్ లో నాలుగో భాగం తెరకెక్కిస్తానని చెప్పిన సంగతి తెల్సిందే. నాలుగో చిత్రానికి విక్టరీ వెంకటేష్ ను హీరోగా అనుకుంటున్నాడు. అయితే ఈ చిత్రానికి వెంకటేష్ ఓకే అంటాడో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.