బయపెడతానంటోన్న అవికా గోర్


Raju Gari Gadhi 3 First Look Poster out
Raju Gari Gadhi 3 First Look Poster out

‘జీనియస్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఓంకార్ టెక్నీకల్ వైజ్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. ఇక ఓంకార్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం రాజుగారి గది. ఎక్స్ పెక్టేషన్స్ ఏమి లేకుండా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది.

ఆ సీరీస్లో భాగంగా కింగ్ నాగార్జునతో రాజుగారి గది-2 చేసారు.. ఆ చిత్రం యావరేజ్ టాక్ తో నడిచింది. ఇదిలా ఉండగా మళ్ళీ ఓంకార్ రాజుగారి గది-3 చేస్తున్నారు. లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తూ సైలెంట్ గ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసారు దర్శకుడు ఓంకార్. తన సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఓక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓంకార్ స్వయంగా ఈ రాజుగారి గది- 3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం పోస్టర్ ను వినాయక చవితి సందర్బంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో అవికా భయంకరంగా కనిపిస్తూ.. అందరినీ భయబ్రాన్తులకు గురిచేస్తుంది.. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫియెర్సీ ఫస్ట్ లుక్ ని సెన్సషనల్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. దర్శక నిర్మాత ఓంకార్..