రేపు విడుదల కానున్న రాక్షసుడు ట్రైలర్!


rakshasudu movie trailer release tomorrow sai srinivas
rakshasudu movie trailer release tomorrow sai srinivas

వరుస ప్లాపులతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి “రాక్షసుడు” ఏమాత్రం హిట్ ఇస్తుందో ప్రేక్షకులే చెప్పాలి..! ఈ చిత్రం ట్రైలర్ రేపు మధ్యాన్నం విడుదల చేయనున్నారు. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లుడు శీనుతో చిత్రంతో అదరగొట్టిన సాయి శ్రీనివాస్ ఆతర్వాత వచ్చిన ఏ చిత్రం కూడా సరిగా ఆడలేదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ “రాక్షసుడు” చిత్రంతోనైనా హిట్ కొడతాడో లేదో అన్న అనుమానాలు సర్వత్రా కలిగిస్తున్నాయి. దర్శకుడు రమేష్ వర్మ సూపర్ హిట్ కొట్టాలన్న కసితో ఈ చిత్రాన్ని టేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించిందని తెలిసింది. అలాగే కోనేరు సత్యనారాయణ మంచి టేస్ట్ వున్న నిర్మాత. నాలుగైదు చిత్రాలు నిర్మించినప్పటికీ కూడా ఇంత వరకు ఆయనకు సరైన హిట్ సినిమా లభించలేదు. అలాగే దర్శకుడు రమేష్ వర్మ కు కూడా ఇంత వరకూ బ్రేక్ రాలేదు..ఈ ముగ్గురికీ ప్రస్తుతం ఓ భారీ హిట్ చిత్రం కావాలి..అది రాక్షసుడు చిత్రం ద్వారా నెరవేరుతుందో లేదో చూడాలి మరీ.! ఆగస్టు 15న స్వాతంత్రదినోత్సవం సందర్బంగా రాక్షసుడు సినిమా విడుదలవుతోంది!!