సీక్వెల్ లో ఎక్స్ కు స్థానం లేదట

సీక్వెల్ లో ఎక్స్ కు స్థానం లేదట
సీక్వెల్ లో ఎక్స్ కు స్థానం లేదట

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్థానానికి పోటీ పడుతున్న హీరోయిన్లలో ముందు వరసలో ఉందీ భామ. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ హాట్ ఆఫర్లను తన్నుకుపోతోంది కానీ రష్మిక మొదట ఎంట్రీ ఇచ్చింది కన్నడ సినిమా ద్వారానే. అక్కడ మొదట చేసిన కిరిక్ పార్టీ పెద్ద హిట్. అదే సినిమాను తెలుగులో నిఖిల్ కిరాక్ పార్టీ పేరుతొ రీమేక్ చేసి ప్లాప్ తిన్నాడు.

తెలుగులో ప్లాపైంది కానీ కన్నడలో ఈ సినిమా పెద్ద హిట్టు. ఈ సినిమాతో రష్మికకు కన్నడలో ఎనలేని క్రేజ్ వచ్చింది. కిరిక్ పార్టీలో రక్షిత్ శెట్టి హీరో. ఈ ఇద్దరి మధ్య అనుబంధం పెళ్లి పీటలు ఎక్కుతుంది అనుకున్నారు. నిశ్చితార్ధం కూడా అయింది కానీ తెలుగులో అదే సమయంలో అవకాశాలు రావడం, రక్షిత్ శెట్టి ఇంట్లో పెళ్లి తర్వాత సినిమాలకు ఒప్పుకోకపోవడంతో రష్మిక బ్రేకప్ చెప్పక తప్పలేదు. బ్రేకప్ జరిగిన తర్వాత కన్నడ సైడ్ నుండి చాలానే ట్రోల్స్ ను ఎదుర్కొంది రష్మిక. రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆమెను బాగానే టార్గెట్ చేసారు. అయితే తర్వాత్తర్వాత రష్మిక తెలుగులో బిజీ స్టార్ గా ఎదిగింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్స్ తో ఆమె స్థానం ఇక్కడ పదిలం. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాకు సైన్ చేసింది.

రక్షిత్ శెట్టి ఇటీవలే అతడే శ్రీమన్నారాయణ పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు కిరిక్ పార్టీకి సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డాడు రక్షిత్ శెట్టి. మరి ఆ సినిమాకు సీక్వెల్ అంటే అందులో రష్మిక ఉంటుందా అని సహజంగానే అందరికీ డౌట్స్ వస్తాయి. ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టిని అడిగితే డైరెక్ట్ గా సమాధానం చెప్పలేదు. ఇందులో కొత్త వాళ్ళు నటిస్తారు అని ఒక్క ముక్కలో తేల్చేసాడు. అంటే దానర్ధం కిరిక్ పార్టీ సీక్వెల్ లో రష్మికకు స్థానం లేదు. బ్రేకప్ విషయంలో కూడా ఇద్దరూ హుందాగానే ప్రవర్తిస్తారు.