ర‌కుల్ జోరు మామూలుగా లేదుగా!

Rakul instagram followers reaches to 15 millions
Rakul instagram followers reaches to 15 millions

సోష‌ల్ మీడియాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ జోరు మామూలుగా లేదు. అన‌తి కాలంలోనే ర‌కుల్ అరుదైన ఘన‌త‌ని సాధించింది. ర‌కుల్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా 15 మిలియ‌న్ కు పైగా ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకుంది. క‌న్నడ హిట్ చిత్రం `గిల్లి`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్ `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`తో స‌క్సెస్ బాట ప‌ట్టింది. ఆ త‌రువాత వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ఒకే ఏడాది వ‌రుస‌గా రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్‌గా రికార్డు సాధించింది కూడా. హీరోయిన్‌గా బిజీగా వుంటూనే సోష‌ల్ మీడియాలోనూ జోరు పెంచేసింది. వ‌రుస‌గా త‌న‌ వ‌ర్కువుట్ల‌కు సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని, నెటిజ‌న్స్‌ని అట్రాక్ట్ చేసిన ర‌కుల్ భారీగానే ఫాలోవ‌ర్స్‌ని పెంచేసుకుంది.

హీరోయిన్‌గా క్రేజ్ త‌గ్గినా ఇన్ స్టాలో ర‌కుల్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య ఈ మ‌ధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెరిగి 15 మిలియ‌న్‌లు దాట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని నెటిజ‌న్స్ తో పంచుకోవ‌డం కోసం ర‌కుల్ ఓ వీడియోని షేర్ చేసింది. తాను చిన్న వ‌య‌సు నుంచే న‌టించ‌డం మొద‌లుపెట్టాన‌ని, సోష‌ల్ మీడియా  ద్వారానే చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని, త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ని ర‌కుల్ వెల్ల‌డించింది.