ర‌కుల్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా?

ర‌కుల్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా?
ర‌కుల్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా?

కాలం క‌లిసి రాన‌ప్పుడు ఓడ‌లు బ‌ల్లువుతాయి.. బ‌ల్లు ఓడ‌ల‌వుతాయంటారు. ఇది అక్ష‌రాలా నిజ‌మే. క్రేజ్ హిట్‌కి మాత్ర‌మే విలువనిచ్చే సినిమా రంగంలో హిట్ వుంటేనే వాల్యూ… లేదంటే ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోరు. ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది హాట్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. తెలుగులో ఒక ద‌శ‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

అయితే వ‌రుస‌గా స్టార్ హీరో మహేష్‌తో చేసిన ల`స్పైడ‌ర్‌`, కార్తితో చేసిన `దేవ్‌`, సూర్య‌తో క‌లిసి న‌టించిన  `ఎన్‌జీకే`, నాగార్జున‌తో ఓ స్టెప్ దిగి మ‌రీ చేసిన `మ‌న్మ‌ధుడు -2` ఫ్లాప్ కావ‌డంతో ఒక్క‌సారిగా ర‌కుల్ క్రేజ్ ప‌డిపోయింది. దీంతో అనుకున్న స్థాయిలో అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక‌పోయింది.

త‌మిళంలో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `భార‌తీయుడు 2` చిత్రంతో పాటు మ‌రో రెండు హిందీ చిత్రాల్లో న‌టిస్తున్నా ర‌కుల్ చేతిలో మాత్రం తెలుగులో ఒకే ఒక్క చిత్రం వుంది. అది నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్  ఏలేటి రూపొందిస్తున్న `చెక్‌`. ఈ సినిమాతో మ‌ళ్లీ ర‌కుల్ తెలుగులో బైన్స్ బ్యాక్ కావాల‌ని చూస్తోంద‌ట‌. అది ఎంత వ‌ర‌కు స‌ఫ‌లం అవుతుంద‌న్న‌ది ఈ సినిమా ఫ‌లితాన్ని బ‌ట్టి తేలుతుంద‌ని ఫిల్మ్ వ‌ర్గాలు అంటున్నాయి.