రకుల్ తమ్ముడి సినిమా ప్రారంభం


Rakul preet singh brother Aman debut film launched

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్  హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఈరోజు అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమైంది . దాసరి లారెన్స్ దర్శకత్వంలో రజనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .  ఈ చిత్ర  ప్రారంభోత్సవ వేడుకకు రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా మంచు లక్ష్మి ,సందీప్ కిషన్ , రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు . ముహూర్తపు షాట్ కు రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించింది ఇక కెమెరా స్విచాన్ చేసింది హీరో సందీప్ కిషన్ .

 

అమన్ – మోనికా శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది . తన సోదరుడు నటనలో అలాగే డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాడని , అతడికి నటన పట్ల ప్యాషన్ ఉందని …… నన్ను ఆదరించినట్లుగానే నా తమ్ముడ్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు . సినిమారంగం అంటే ఎలాగూ వారసుల రాజ్యం అనే విషయం తెలిసిందే . మరి రకుల్ సోదరుడు హీరోగా సక్సెస్ అవుతాడో లేదో తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: Rakul preet singh brother Aman debut film launched