ఆంగ్ల పత్రికపై మండిపడిన రకుల్


Rakul Preet Singh
Rakul Preet Singh

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఆంగ్ల పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది . తాజాగా ఈ భామ నాగార్జున సరసన మన్మథుడు 2 చిత్రంలో నటించింది . ఆ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను వెల్లడించింది . అయితే కాస్త అసహనంతో రగిలిపోయింది ప్రశ్నలు వేస్తున్న సమయంలో .

కట్ చేస్తే ఆంగ్ల పత్రికలో కథనం మరోలా రావడంతో నేను చెప్పింది వేరు , ఇలా ఎలా రాస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . మన్మథుడు 2 చిత్రంలో అవంతిక క్యారెక్టర్ ప్లే చేస్తున్నానని , అయితే అవంతిక కు సిగరెట్ తాగడం అలవాటు తప్ప నాకు నిజజీవితంలో మద్యం కానీ , సిగరెట్ తాగడం అలవాట్లు లేవని స్పష్టం చేసింది .