నెటిజన్ల పై మండిపడుతున్న రకుల్


Rakul Preet Singh
Rakul Preet Singh

హీరోలు సిగరెట్ తాగితే తప్పులేదు కానీ మేము తాగితే తప్పు పడతారా ? అంటూ నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ . తాజాగా ఈ భామ మన్మథుడు 2 చిత్రంలో అవంతిక పాత్రలో నటించింది . అయితే అవంతిక పాత్ర స్వభావం వేరు అందుకే సిగరెట్ తాగాల్సి వచ్చింది , అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పాల్సి వచ్చిందని అంతేకాని రకుల్ ప్రీత్ సింగ్ గా నేను చేస్తే తప్పు అని వివరణ ఇస్తోంది రకుల్ .

మన్మథుడు 2 చిత్రంలో రకుల్ బోల్డ్ గా నటించడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు రకుల్ పై దాంతో రివర్స్ గేర్ లో రకుల్ మండిపడుతోంది . ఇక నిన్న విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది . కలెక్షన్లు కూడా అంత గొప్పగా ఏమీలేవు . దాంతో రేపు సక్సెస్ మీట్ అంటూ మీడియా ముందుకు వస్తున్నారు మన్మథుడు 2 బృందం .